Header Banner

ఏపీ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది! రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో...

  Mon Apr 28, 2025 15:17        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఇవాళ(సోమవారం) రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ, క్లస్టర్ల రూపకల్పన కోసం మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం జరిగింది. మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ సదస్సులో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు విజన్ 2020 వల్ల ఏపీ టెక్నాలజీ రంగంలో అభివృద్ధి పథంలో సాగుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విమానయానం, రక్షణ రంగాల్లో కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు.

 

ఇది కూడా చదవండి: సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈవోలంతా భారతీయులే.! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే వందశాతం రక్షణ రంగ ఉత్పత్తుల తయారికీ కృషి జరుగుతుందని తెలిపారు. రాష్ట్రానికి సలహాదారులుగా ఉన్న డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అనుభవం చాలా అవసరమని అన్నారు. రాష్ట్రం భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్‌కు ఆహ్వానం పలుకుతున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations